IND vs BAN 2019 : Bangladesh Announce Squad For India T20I Series || Oneindia Telugu

2019-10-18 1

Bangladesh have recalled spinner Arafat Sunny and pace bowler Al-Amin Hossain to their 15-man squad for the upcoming three-match Twenty20 International series Over India. Sunny hasn't played for Bangladesh since he was suspended during the 2016 ICC World Twenty20 for an illegal bowling action.
s#indiavsbangladesh
#Bangladesh
#India
#T20ISeries
#teamindia
#shakibalhasan
#tamimiqbal
#ArafatSunny

నవంబర్‌లో భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ షకీబుల్ హసన్ టీ20 సిరీస్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. స్వదేశంలో ఇటీవల ముగిసిన ముక్కోణపు టోర్నీకి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ జట్టులోకి పునరాగమనం చేసాడు.స్పిన్నర్‌ అరాఫత్‌ సన్నీ, పేసర్ అల్‌అమీన్‌ హుస్సేన్‌లకు బంగ్లాదేశ్‌ సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత వీరు జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు ఆఖరిగా 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆడారు. భారత్‌ వేదికగా జరిగిన పొట్టి సమరంలో సన్నీ బౌలింగ్‌ యాక్షన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన ప్రియురాలి వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన ఆరోపణలను ఎదుర్కొన్న అతడు 2017లో అరెస్టు అయ్యాడు. రెండు నెలల జైలు జీవితం కూడా గడిపారు.